యథేచ్ఛగా బెల్టు దందా! | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా బెల్టు దందా!

Oct 21 2026 8:14 AM | Updated on Oct 21 2026 8:14 AM

యథేచ్ఛగా బెల్టు దందా!

వికారాబాద్‌: గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసులకు సవాలుగా మారినప్పుడు.. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో మాత్రమే బెల్టు షాపులను కట్టడి చేస్తున్నారు. ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో గ్రామాల్లో మద్యం తాండవిస్తోంది.. దసరా పండుగ కావటంతో గ్రామాల్లోని బెల్టు షాపులకు పెద్ద మొత్తంలో మద్యం తరలిస్తున్నారు. ఇటీవల మున్సిపల్‌, జీపీ ఎన్నికల సమయంలో బెల్టు షాపుల నిర్వాహకులపై వందల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. పలువురిని బైండోవర్‌ చేసి అమ్మకాలను కట్డడి చేశారు. పెద్ద మొత్తంలో మద్యం సీజ్‌ చేశారు. ఎన్నికల అనంతరం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇక కల్లు దుకాణాల విషయం చెప్పనవసరం లేదు. మందు కలపని కల్లు అంటే బంగారంతో సమానమే. తరచు కల్తీ కల్లు తాగి పలువురు ఆస్పత్రి పాలవుతున్నారు. కల్లులో ఆల్పాజోలం లాంటి డ్రగ్స్‌ వాడుతుండటంతో మత్తుకు బానిసలవుతున్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో నిబంధనలకు విరుద్ధంగా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నారు. వీటిని కట్టడి చేయటంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. దీంతో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది.

మామూళ్ల మత్తులో..

తండాలు, గిరిజన గూడాలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో గుడుంబాను కట్టడి చేసిన ఎకై ్సజ్‌ అధికారులు బెల్టు షాపులను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. క్వార్టర్‌, హాఫ్‌, ఫుల్‌ బాటిల్‌, బీరు బాటిల్‌ ధరపై రూ.10 నుంచి రూ.50 వరకు పెంచి విక్రయిస్తున్నారు. పోలీసుల దాడుల్లో బెల్టు షాపు నిర్వాహకులు పట్టుబడితే వీరికి మద్యం సరఫరా చేసే దుకాణ యజమానులు రక్షణగా నిలుస్తున్నారు. వారి పలుకుబడితో కేసులు కాకుండా చూస్తున్నారు. ఎకై ్సజ్‌ అధికారులు నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసు శాఖలో కూడా ఈ తంతు కొనసాగుతోంది.

గల్లీకో దుకాణం

గ్రామాల్లో ప్రతి వీధిలో మద్యం విక్రయాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కిరాణా దుకాణాల కంటే బెల్టు షాపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెజార్టీ దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక్కో ఎకై ్సజ్‌ ఠాణా పరిధిలో 400 వరకు బెల్టు షాపులు ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా దాదాపు 1900 షాపులు ఉన్నట్లు తెలిసింది. మద్యం దుకాణంలో ఒక రోజు వ్యాపారం 30 శాతం ఉంటే బెల్టు షాపుల్లో 70 శాతం అమ్మకాలు ఉంటున్నాయి. రోజుకు రూ.లక్ష అమ్మకాలు దాటని షాపులో నేడు రూ.5 నుంచి రూ.10 లక్షలు దాటి సేల్స్‌ ఉంటున్నాయి. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి కొన్ని దుకాణాల్లో రీటేల్‌గా విక్రయిస్తు మరికొన్ని దుకాణాల్లో హోల్‌సెల్‌గా బెల్టు షాపులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.

తరచూ గొడవలు

మందు బాబుల కారణంగా గ్రామాల్లో తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. మహిళలు, యువతులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. మద్యం తాగి కుటుంబ సభ్యులపై దాడు చేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. రోజంతా కష్టపడగా వచ్చిన డబ్బును తాగుడుకు తగలేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఎకై ్సజ్‌, పోలీస్‌ శాఖ అధికారులు బెల్టు షాపులను కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.

60నుంచి 70శాతం మద్యం నిల్వలు బెల్టు షాపుల ద్వారానే విక్రయం

కిరాణ దుకాణాల కంటే ఇవే అధికం

దసరా పండుగ నేపథ్యంలో గ్రామాలకు భారీగా తరలింపు

అదే స్థాయిలో మందు కల్లు విక్రయాలు

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement