సాయన్న జయంతిని ఘనంగా నిర్వహిద్దాం | - | Sakshi
Sakshi News home page

సాయన్న జయంతిని ఘనంగా నిర్వహిద్దాం

Oct 21 2026 8:14 AM | Updated on Oct 21 2026 8:14 AM

పరిగి: పండుగల సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషించ దగ్గ విషయమని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని తన నివాసంలో వేడుకలకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించుకుందామని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తొలి స్వాతంత్య్ర సమరయోధుడికి కాంగ్రెస్‌ ప్రభుత్వం మంచి గౌరవం ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రాములు, పట్టణ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నాయకులు మాణిక్యం, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement