తల్లీబిడ్డ క్షేమం
తాండూరు: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ ప్రసవించింది. ఈ ఘటన తాండూరులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతం జెట్టూరు గ్రామానికి చెందిన పుష్పలత తాండూరు నుంచి సొంత గ్రామానికి బస్సులో బయలుదేరింది. మండలంలోని గౌతాపూర్ వద్ద మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. డ్రైవర్, కండక్టర్ తాండూరు వైపు వెళ్తున్న కర్ణాకట ఆర్టీసీ బస్సును ఆపి పుష్పలతను తాండూరులోని మాతాశిశు ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరారు. బస్సు ఆస్పత్రికి చేరుకోగానే అందులోనే మహిళ ప్రసవించింది. వైద్యులు తల్లీబిడ్డను పరీక్షించారు. సహకరించిన కర్ణాకట ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌కు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


