అనంతగిరి: వికారాబాద్ పట్టణం ఆలంపల్లిలోని లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం పెరుగుబసంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అనంతరం స్వామివారు గరుడ వాహనంపై విహరించారు. మున్సిపల్ తరఫున వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, ఆలయ ఈఓ నరేందర్, ట్రస్టీ చైర్మన్ పద్మనాభం, కౌన్సిలర్లు చిగుళ్లపల్లి రమేష్‌కుమార్, లక్ష్మికాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


