కొందుర్గును కరువు మండలంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

కొందుర్గును కరువు మండలంగా ప్రకటించాలి

Oct 21 2026 8:02 AM | Updated on Oct 21 2026 8:02 AM

కొందుర్గు: కొందుర్గు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం తహసీల్దార్‌ ఆజాం అలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయని, కరెంట్‌ సరఫరా లేక పంటలు దెబ్బతిన్నాయని వాపోయారు. అధికారులు దెబ్బతిన్న పంటలను సర్వేచేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎకరానికి రూ. 50 వేలు రైతులకు అందించాలన్నారు. వినతిపత్రం అందించిన వారిలో నాయకులు వెంకటేశ్‌, కృష్ణ, భూపాల్‌, యాదయ్య, పద్మమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement