కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని వనంపల్లిలో సోమవారం ఇన్‌చార్జి తహసీల్దార్ భాస్కర్ స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ కార్డులు లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, సర్పంచ్‌లు అరుణ, రామచంద్రయ్య, నాయకులు పాల్గొన్నారు.
నియామకం
శంకర్‌పల్లి: ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా శంకర్‌పల్లికి చెందిన తొండ యాదయ్య నియామకమయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన నగరంలో సంఘం జాతీయ అధ్యక్షుడి నుంచి నియామకం పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా తొండ యాదయ్య మాట్లాడుతూ.. డా.బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా తాను ముందుకు సాగనున్నట్లు స్పష్టం చేశారు.
కార్మికులకు అండగా ఉంటాం
శంకర్‌పల్లి: మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్‌కుమార్ జన్మదినం సందర్భంగా సోమవారం శంకర్‌పల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కార్మికులకు వారి దంపతులు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కార్మికులు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో జీవించాలని, ఏ కష్టం వచ్చినా సాయం అందించేందుకు ముందుంటానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ సాత విజయలక్ష్మి, నాయకులు పాండురంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దుస్తుల పంపిణీ
చేవెళ్ల: దసరా పండుగ సందర్భంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని పామెన వార్డులో కౌన్సిలర్ దవాల్‌గారి గోపాలరెడ్డి కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అదేవిధంగా దామరగిద్ద వార్డులో మాజీ సర్పంచ్ మధుసూదన్‌గుప్తా, చేవెళ్లలో మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమతారెడ్డి కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం వారు ప్రజలకు, కార్మికులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
క్రీడలతో శారీరక దారుఢ్యం
మొయినాబాద్‌రూరల్: క్రీడలు శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని మండల సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి మాడి రాజేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కాశీంబౌలిలో కీర్తిశేషులు గుమ్మి చంద్రశేఖర్‌రెడ్డి, మాడి శివాంత్‌రెడ్డి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌కు చుట్టు పక్కన గ్రామాల నుంచి క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభ కనబరిచారు. గెలుపొందిన వారికి రాజేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు మాడి విజయ్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శరత్‌రెడ్డి పాల్గొన్నారు.
పాలపిట్టను బంధిస్తే చట్టరీత్యా చర్యలు
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
అన్వర్ హుస్సేన్‌ఖాన్
కేశంపేట: దసరా పండుగను పురస్కరించుకొని గ్రామాల్లో ఎక్కడైనా పాలపిట్టను బంధించినా, విక్రయించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కేశంపేట ఫారెస్ట్ సెక్షన్ అధికారి అన్వర్ హుస్సేన్‌ఖాన్ తెలిపారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ పరమేశ్‌తో కలిసి కేశంపేట ఫారెస్టు సెక్షన్ అధికారి అన్వర్ హుస్సేన్‌ఖాన్ పాలపిట్ట సంరక్షణకు సంబంధించిన మన రాష్ట్ర పక్షి–పాలపిట్ట వాల్‌పోస్టర్‌ను అవిష్కరించారు. అనంతరం మండల కేంద్రంలో ప్రజలకు పాలపిట్టను బంధించొద్దని, దాని సంరక్షణకు సహకరించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. పాలపిట్టను బంధించడం, వేటాడడం వన్యప్రాణుల సంరక్షణ చట్టానికి విరుద్ధమన్నారు. ఎవరైన చట్టంకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారిపైన వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అయన హెచ్చరించారు. పండుగల సమయంలో సాంప్రదాయాలను పాటిస్తూ ప్రకృతిని, పక్షులను కాపాడుకోవాలని అయన కోరారు. కార్యక్రమంలో పోలీస్, మండల పరిషత్ కార్యాలయ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


