కేశంపేట: గ్రామాల్లో అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ, ఇప్పలపల్లి, దేవునిగుడితండా, వేములనర్వ, కేశంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనుమగళ్ల రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ యెన్నం శ్రీధర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు చేవెళ్ల శశిరేఖ యాదయ్య, మంజుల జంగయ్య, సుజాత, సువర్ణ చిన్ననర్సింహ, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విశాల శ్రావణ్‌రెడ్డి, వీరేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ వర్కల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్


