షాద్‌నగర్: దసరా పండుగను పురస్కరించుకొని ఫరూఖ్‌నగర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఆవరణలో నిర్వహించనున్న ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం విశ్వహిందూ పరిషతత్‌్ నాయకులతో కలిసి బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అందె బాబయ్య, శ్రీవర్ధన్‌రెడ్డి, నాయకులు చెట్ల వెంకటేశ్, డాక్టర్ రాచప్ప మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం 4.30 నుంచి పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ దేవాలయం నుంచి వేంకటేశ్వరస్వామి దేవాలయం వరకు ఊరేగింపు, అనంతరం సాయంత్రం 7 గంటలకు రావణ దహనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దసరా ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌చారి, శివలింగం, అంబలి శ్రీశైలం, గణేష్, అభిలాశ్ పాల్గొన్నారు.


