బీఆర్‌ఎస్‌పై నమ్మకంతోనే చేరికలు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌పై నమ్మకంతోనే చేరికలు

Oct 19 2026 7:47 AM | Updated on Oct 19 2026 7:47 AM

కొత్తూరు: బీఆర్‌ఎస్‌ పార్టీపై నమ్మకంతోనే ఇతర పార్టీల నుంచి నాయకులు, ప్రజా ప్రతినిధులు పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పెంజర్ల గ్రామ ఉపసర్పంచ్‌ శంతన్‌రెడ్డితో పాటు సుమారు 100 మంది కాంగ్రెస్‌, ఇతర పార్టీల నుంచి వార్డుసభ్యులు, నాయకులు ఆయన సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇందులో భాగంగా వారికి ఆయన పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గత కొన్నిరోజుల ముందే ఇదే గ్రామం నుంచి పలువురు నాయకులు ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీతోనే అభివృద్ధి, నిరుపేదల సంక్షేమం సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు వేదాంతచారి, ఆర్భాస్‌, సహదేవ్‌, రాములు, మాధవి, మైబుబ్‌, బ్యాగరి రాజు, శివాచారి, అనిల్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement