ఇప్పాయిపల్లి వాసికి ఫిల్మ్‌మేకర్స్‌ బహుమతి | - | Sakshi
Sakshi News home page

ఇప్పాయిపల్లి వాసికి ఫిల్మ్‌మేకర్స్‌ బహుమతి

Oct 18 2026 7:45 AM | Updated on Oct 18 2026 7:45 AM

ఇప్పాయిపల్లి వాసికి ఫిల్మ్‌మేకర్స్‌ బహుమతి ఉత్సాహంగా అండర్‌ –19 క్రికెట్‌ పోటీలు

కుల్కచర్ల: బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌మేకర్స్‌ ఛాలెంజ్‌ అవార్డ్‌ 2026లో మండల వాసి సత్తాచాటి మొదటి బహుమతి పొందారు. ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్‌.. శనివారం నగరంలోని శిల్పాకళావేదికలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుల చేతుల మీదుగా నగదు బహుమతి అందుకున్నారు.

కేయూ క్యాంపస్‌: తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (టీసీఏ) ఆధ్వర్యంలో అండర్‌ 19 క్రికెట్‌ స్టేట్‌ లీగ్‌ పోటీలు కాకతీయ యూనివర్సిటీలోని క్రీడామైదానంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. శనివారం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. జనగామ, రంగారెడ్డి జట్లు తలపడగా జనగామ జట్టు విజేతగా నిలిచింది. రెండో మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జట్లు తలపడగా వికారాబాద్‌ జట్టు గెలిచింది. మూడో మ్యాచ్‌లో నారాయణపేట, అచ్చంపేట జట్లు తలపడగా అచ్చంపేట జట్టు విజయం సాధించింది. నాలుగో మ్యాచ్‌లో జనగామ, ఖమ్మం జట్లు తలపడగా జనగామ విజేతగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement