కొడంగల్: యూత్ ఫర్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌గౌడ్, కొడంగల్ క్రిటికల్ కేర్ యూనిట్ ఆర్‌ఎంఓ డాక్టర్ రవీంద్రా యాదవ్, ఎంఈఓ రాంరెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ బడిలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దేశ స్థాయిలో ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ పోటీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా 9వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఏడాదికి 12 వేల రూపాయల చొప్పున స్కాలర్ షిప్ వస్తుందన్నారు. అదే విధంగా ఈ పరీక్ష రాసిన విద్యార్థులకు దేశ స్థాయిలో నిర్వహించే ఇతర పోటీ పరీక్షలకు అవగాహన కలుగుతుందని వివరించారు. యూత్ ఫర్ సేవ కార్యక్రమాల వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం జాక వెంకటేశం, గణిత ఫోరం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, ఎస్‌ఆర్పీ వీరేశం, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, టీవీవీ సభ్యుడు అనిల్‌కుమార్, అమ్మ నాన్న ఫౌండేషన్ ఫౌండర్ ప్రవీణ్‌కుమార్, కూర నర్సింలు, చంద్రశేఖర్‌రెడ్డి, యూత్ ఫర్ సేవా సభ్యులు సతీష్, స్వరూప, పుండరీకాక్ష తదితరులు పాల్గొన్నారు.


