పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం

Sep 30 2026 7:36 AM | Updated on Sep 30 2026 7:36 AM

● తాండూరును సుందరంగా మారుస్తాం

● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి

తాండూరు: పట్టణాన్ని స్వచ్ఛంగా.. సుందరంగా తీర్చే దిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఒకటి నుంచి ఆరు వార్డుల్లో స్వచ్ఛ తాండూరుపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పలుచోట్ల పారిశుద్ధ్యం లోపించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల నివారణకు ఫాగింగ్‌ చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆయా వార్డు ప్రజలను అడిగారు. తమ కాలనీకి పైప్‌లైన్‌ వ్యవస్థ లేదని ఇందిరానగర్‌ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. స్పందించి ఆయన త్వరలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పలు చోట్ల వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు చెప్పడంతో రెండు మూడు రోజుల్లో దీపాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాకేష్‌రెడ్డికి సూచించారు. అనంతరం మల్‌రెడ్డిపల్లి, ఇంద్రనగర్‌లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలను తనిఖీ చేశారు. ఉదయం విద్యార్థులతో కలిసి అల్హాహారం తీసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల పౌష్టికాహారంపై ఆరా తీశారు. ఆరోగ్య ఉప కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ రజాక్‌, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజ్‌, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement