కందుకూరు: ఫ్యూచర్‌సిటీలో నిర్మాణంలో ఉన్న రేడియల్ రోడ్డుతో పాటు స్కిల్స్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న భవనాలను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఎఫ్‌సీడీఓ భవనంలో ఎఫ్‌సీడీఓ కమిషనర్ శశాంక, కలెక్టర్ నారాయణరెడ్డి, హెచ్‌ఎండీఏ ఎండీ సర్ఫరాజ్ తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ వరకు రేడియల్ రోడ్డులో రాకపోకలు సాగించేలా పనులు వేగవంతం చేయాలని, స్కిల్స్ యూనివర్సిటీ భవనాలను అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. అక్టోబర్ వరకు పనులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. వారి వెంట కందుకూరు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓలు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, టీజీఐఐసీ సీజీఎం అనంత్‌రెడ్డి పాల్గొన్నారు.


