తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు: పట్టభద్రుల ఓటరు జాబితా ప్రక్రియపై బీఆర్‌ఎస్ నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి సూచించారు. మంగళశారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాఽధించేలా కృషి చేయాలన్నారు.
మృతుని కుటుంబానికి
పరిహారం అందజేత
అనంతగిరి: అనారోగ్యంతో మృతి చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్ కుటుంబానికి రూ.16.50 లక్షల పరిహారం అందిందని వికారాబాద్ బ్రాంచ్ ప్రెసిడెంట్ వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఎల్‌ఐసీ ఏజెంట్ ఎండీ మహబూబ్ అనారోగ్యంతో మృతి చెందారు. సెటిల్మెంట్ పత్రాలను మృతుని భార్యకు అందజేశారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీరాములు, ఏబీఎం సుందర్, లియాఫీ రాష్ట్ర నాయకులు వెంకటేశం, జోనల్ కార్యదర్శి బుచ్చిరెడ్డి, సత్యనారాయణ, జంగయ్య, విజయేందర్, పాండు, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేశంపేట: వర్షాభావ పరిస్థితుల కారణంగా భవిష్యత్‌లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు చర్యల్లో భాగంగా ఫాంపాండ్‌లను నిర్మించుకోవాలని డీఆర్డీవో పీడీ శ్రీలత సూచించారు. మండల పరిఽధిలోని పాపిరెడ్డిగూడ, వేములనర్వ, పోమాల్‌పల్లి, అల్వాల గ్రామాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పంటల సాగుకు అవసరమైన నీటిని పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు వర్షపు నీటిని పొలాల్లో నిల్వ చేసుకునేలా అవసరమైన నిర్మాణాలు చేసుకోవాలన్నారు. ఫాంపాండ్‌ల నిర్మాణాలతో తక్కువ వర్షపాతం నమైదెన పంటలకు నీటి కొరత ఉండదన్నారు. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా పొలాల్లోనే నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు తోడ్పడుతుందని తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా నీటి సంరక్షణ పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీ తరుణ్‌గౌతమ్, ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి, ఈసీ అజీజ్, టీఏ నీలకంఠంబాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
స్కూటీ అదుపుతప్పి..
తలపై నుంచి ట్రాక్టర్ వెళ్లి..
మీర్‌పేట: ఓవర్‌టెక్ చేస్తుండగా స్కూటీ అదుపుతప్పి పడిపోగా మహిళ తలపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నాదర్‌గుల్‌కు చెందిన ప్రసన్నలక్ష్మి (29)కి భర్త అనిల్‌రెడ్డి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రసన్నలక్ష్మి బీఎన్‌రెడ్డినగర్‌లోని డ్రైవింగ్ స్కూల్‌లో కారు నేర్చుకుంటోంది. మంగళవారం ఉదయం 10 గంటలకు స్కూటీపై బడంగ్‌పేట నుంచి రాజీవ్‌గృహకల్ప రహదారిపై వెళ్తుండగా మారుతీనగర్ వద్దకు రాగానే ట్రాక్టర్‌ను ఓవర్‌టెక్ చేయబోతుండగా ఎదురుగా ఆటో రావడంతో సడెన్ బ్రేకు వేసింది. దీంతో స్కూటీ అదుపుతప్పి కిందపడగా ట్రాక్టర్ తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


