చేవెళ్ల: కూలి చేసుకునేందుకు చేవెళ్లకు వలస వచ్చిన ఓ మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా పానగల్ గ్రామానికి చెందిన గువ్వల అగ్గరయ్య, భార్య మంజుల(27) చేవెళ్లకు వలస వచ్చారు. మున్సిపల్ కేంద్రంలో వికారాబాద్ రోడ్డు సమీపంలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన ఉదయం టిఫిన్ తీసుకుని వస్తానని చెప్పి ఆమె తిరిగి రాలేదు. సాధ్యమైన అన్ని ప్రాంతా ల్లో వెతికినా ఆచూకీ లభించకపతోవడంతో సోమవారం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


