తనిఖీలు నిర్వహించండి | - | Sakshi
Sakshi News home page

తనిఖీలు నిర్వహించండి

Sep 29 2026 7:18 AM | Updated on Sep 29 2026 7:18 AM

అనంతగిరి: రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలను కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు సూచించారు. సోమవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్‌ దీపక్‌ తివారి తదితరులు పాల్గొన్నారు.

నోటిఫికేషన్‌ పత్రాల విడుదల

కొడంగల్‌ రూరల్‌: మహబూబ్‌నగర్‌ – రంగారెడ్డి – హైదరాబాద్‌ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు సోమవారం తహసీల్దార్‌ రాంబాబు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతులను కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. ఫారం 18 ద్వారా నవంబర్‌ 6వ తేదీ వరకు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ అనిత, సిబ్బంది శ్రీనివాస్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీ

ధారూరు: మండల కేంద్రంలోని వెంకటేశ్వర్‌, తుల్జాభవానీ ఫెర్టిలైజర్‌ దుకాణాలను సోమవారం జిల్లా వ్యవసాయాధికారి కవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లోని స్టాక్‌ రిజిస్టర్లు, బిల్‌ బుక్స్‌, స్టాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీఏఓ వెంట ఏఓ సూర్యప్రకాశ్‌ ఉన్నారు.

పర్యావరణాన్ని

కాపాడుకుందాం

డీఎఫ్‌ఓ విశాల్‌ బత్తుల

అనంతగిరి: అడవులను సంరక్షించి పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్‌ బత్తుల అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవా రం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో కేజీబీవీకు చెందిన సుమారు 150మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ముందుగా వీరికి పర్యాటక ప్రాధాన్యత, ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, బాధ్యతయుతమైన పర్యాటకంపై అవగాహన కల్పించారు. ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ ఆధ్వర్యంలో పాముల ప్రదర్శన నిర్వహించారు. పాముల సంరక్షణ, వాటి ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అనంతరం అనంత పద్మనాభ స్వామి ఆలయం, మూసీ నది పుట్టిన ప్రదేశం, అనంతగిరి ఎకో అర్బన్‌ పార్క్‌, ఛత్రి వ్యూ పాయింట్‌ తదితర ప్రాంతాలను చూపించి వాటి గురించి వివరించారు. అటవీలో నేచర్‌ వాక్‌ నిర్వహించి అడవులు, జీవవైవిద్యం, ప్రకృతి వనరుల పరి రక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ఎఫ్‌ఆర్‌ఓ నాగేశ్వరరావు, సోషల్‌ వర్కర్‌ వెంకట్‌, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement