సృజనాత్మకతను ప్రోత్సహించేందుకే శిక్షణ | - | Sakshi
Sakshi News home page

సృజనాత్మకతను ప్రోత్సహించేందుకే శిక్షణ

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

ఆమనగల్లు: విద్యార్థులు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌, టాస్క్‌ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి సూచించారు. నగరంలోని టాస్క్‌ కార్యాలయంలో ఆదివారం విద్యార్థుల్లో ఆధునిక, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వారిలో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఫిల్మ్‌ మేకింగ్‌, సినిమాటోగ్రఫీపై ఒక రోజు శిక్షణ ఇచ్చారు. మొబైల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌, ఫొటోగ్రఫీ ప్రాథమిక అంశాలు, కెమెరా టెక్నిక్స్‌, ఫ్రేమింగ్‌, లైటింగ్‌, విజువల్‌ స్టోరీ టెల్లింగ్‌, ప్రాథమిక సినిమాటోగ్రఫీపై తర్ఫీదునిచ్చారు. అనంతరం శిక్షణ పొందిన 56 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి.. యువతలో ప్రతిభను వెలికితీయడానికి శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. విద్యార్థులు శిక్షణతో సరిపెట్టుకోకుండా నిరంతర సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌ మేకింగ్‌ ట్రైనింగ్‌ సభ్యులు రోషన్‌ పాల్గొన్నారు.

టాస్క్‌ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement