చిరుత కాదు హైనా | - | Sakshi
Sakshi News home page

చిరుత కాదు హైనా

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

పరిగి: మండలంలోని బసిరెడ్డిపల్లి శివారులో సంచరిస్తోంది చిరుత కాదని హైనా అని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితం కృష్ణగిరి క్షేత్రం గోశాలలో లేగ దూడను చిరుతను పోలిన మృగం ఎత్తుకెళ్లింది. మరుసటి రోజు ఆవుపై దాడికి పాల్పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న గోశాఖ సంరక్షకుడు భయంతో పారిపోయాడు. అనంతరం గ్రామస్తులతో కలిసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ప్రతిమ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గోశాల సంరక్షకుడి చెప్పిన ఆనవాళ్లను బట్టి హైనాగా నిర్దారించారు. హైనాలు కూడా చిరుత పులిని పోలి ఉంటాయని, పశువులపై దాడులు చేసి చంపి తింటాయని తెలిపారు. చర్యలు చేపడతామని ఆమె తెలిపారు.

అటవీ శాఖ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement