కాంగ్రెస్‌కు కార్యకర్తలే బలం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు కార్యకర్తలే బలం

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

తాండూరు: కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే బలమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దేముల్‌లో పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవిలో ఉన్న వారి కంటే ప్రజల్లో ఉన్న కార్యకర్తలకే ఎక్కువ ఆదరణ ఉంటుందన్నారు. వారి కష్టం, బాధ తనకు తెలుసన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని సూచించారు. కాంగ్రెస్‌ వచ్చాక పేదలకు రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని తెలిపారు. కోట్‌పల్లి ప్రాజెక్ట్‌కు రూ.90 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ధారాసింగ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షురాలు శోభారాణి, మాజీ వైస్‌ ఎంపీపీ మధులత, సీనియర్‌ నాయకులు నారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డి, కరణం పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

పార్టీని మరింత బలోపేతం చేస్తాం:

డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement