చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
శంకర్‌పల్లి: దేశంకోసం, ప్రజల కోసం ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణ కేంద్రంలో బీజేపీ మున్సిపల్, మండల అధ్యక్షులు చెందిప్ప దయాకర్‌రెడ్డి, లీలావతి భయానంద్‌ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించి ప్రధాన మంత్రి మన్‌కీ బాత్‌ను వీక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ స్ఫూర్తితో సేవ కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం, సీనియర్ నాయకులు కంజర్ల ప్రకాశ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


