కందుకూరు: ఫ్యూచర్‌సిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ భవనాలను మంగళవారం మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలను ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక, ఐఏఎస్ అధికారి హరిచందనతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్ని రోజుల్లో భవన నిర్మాణాలు పూర్తవుతాయని అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్‌లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు భవనాలు సిద్ధంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అక్టోబర్ 31 లేదా నవంబర్ మొదటి వారం వరకు అంతా సిద్ధం చేసేలా పనులు వేగవంతం చేయాలన్నారు. ఆయన వెంట టీజీఐఐసీ సీఈ రతన్‌రాథోడ్, జోనల్ మేనేజర్ జ్యోతి, తహసీల్దార్ గోపాల్ తదితరులు ఉన్నారు.
గ్లోబల్ సమ్మిట్‌కు సిద్ధం చేయాలని మంత్రి వివేక్ ఆదేశాలు


