పరిగి: మండలంలోని కాళ్లాపూర్‌లో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్క్‌కు అసైన్డ్ భూములు మాత్రమే తీసుకోవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కోరారు. బుధవారం ఆయన ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. గ్రామ పరిధిలో 160 ఎకరాల పట్టా భూములు సేకరించాల్సి ఉందని, అయితే అందరూ పేద రైతులేనని, వాటి జోలికి వెళ్లరాదని కోరారు. కేవలం అసైన్డ్ భూములనే తీసుకోవాలని సూచించారు. అవసరం అయితే ఇతర గ్రామాల్లోని అసైన్డ్ భూములను కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపాలని విన్నవించారు. పరిగి పట్ణంలో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ కాంప్లెక్స్, ఆర్డీఓ కార్యాలయం ర్పాటు చేయాలన్నారు. స్పందించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ విషయాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం
ఇండస్ట్రియల్ పార్క్‌కు ఏర్పాటుకు పట్టా భూములకు మినహాయింపు ఇవ్వాలని ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ అసెంబ్లీలో ప్రస్తావించడంతో కాళ్లాపూర్ గ్రామంలో రైతులు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతులు పోరాటాన్ని గుర్తించి అండగా నిలవడంపై సర్పంచ్ పులీందర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇండస్ట్రియల్ పార్క్‌కు అసైన్డ్ భూములే సేకరించాలి
అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


