యాలాల: గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడింది మాజీ సీఎం కేసీఆర్ అని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని సంగాయిపల్లి తండాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. స్వయం పాలన, రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతంకు పెంచారని గుర్తు చేశారు. గిరిజన యువతకు విద్యకు పెద్దపీట వేయాలనే ఆకాంక్షతో రెసిడెన్షియల్ పాఠశాలలు, ఉపాధి, వ్యవసాయం, మౌలిక వసతుల కోసం నిధులు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సిద్రాల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ రమేష్, నాయకులు రాంచంద్రారెడ్డి, రాజునాయక్, నారాయణ, సుక్యానాయక్, గణేష్, అంజయ్యగౌడ్, హాజీపూర్ రవి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి


