కేసులకు భయపడేది లేదు | - | Sakshi
Sakshi News home page

కేసులకు భయపడేది లేదు

Sep 18 2026 9:30 AM | Updated on Sep 18 2026 9:30 AM

కేసులకు భయపడేది లేదు బీజేవైఎం జిల్లా ఇన్‌చార్జ్‌గా శ్వేతగౌడ్‌ 20న అథ్లెటిక్స్‌ సెలక్షన్స్‌ శివసాగర్‌ ఆధునీకరణకు చర్యలు వ్యక్తిపై కత్తితో దాడి

మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌

అనంతగిరి: అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. ధారూరులో లో రైతులకు ఎరువులు సక్రమంగా అందడం లేదని నిరసన తెలిపిన ఆనంద్‌, బీఆర్‌ఎస్‌ స్థానిక నాయకులపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో, విచారణలో భాగంగా గురువారం ఆయనతో పాటు పలువురు వికారాబాద్‌ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ పోరాడతామన్నారు. కేసులకు భయపడేది లేదన్నారు.

బొంరాస్‌పేట: బీజేవైఎం జిల్లా ఇన్‌చార్జ్‌గా దుద్యాల మండలం హస్నాబాద్‌కు చెందిన కలాల్‌ శ్వేతగౌడ్‌ నియమితులయ్యారు. గురువారం నగరంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును కలిసిన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

తాండూరు టౌన్‌: జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మధు, కార్యదర్శులు రాము, రాములు గురువారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. వికారాబాద్‌లోని బ్లాక్‌ గ్రౌండ్‌లో ఈ పోటీలు ఉంటాయన్నారు. అండర్‌ –14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు రన్నింగ్‌, జంపింగ్‌, షాట్‌పుట్‌ ఈవెంట్లలో ఎంపిక ప్రకియ ఉంటుందన్నారు. క్రీడాకారులు ఒరిజినల్‌ జనన ఽధ్రువీకరణ పత్రం లేదా ఎస్సెస్సీ మెమోతో రావాలన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈనెల 26, 27వ తేదీల్లో హన్మకొండలోనిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఇతర వివరాలకు సెల్‌ నంబర్‌ 9951343432, 6300075229లలో సంప్రదించాలన్నారు.

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణ పరిధిలోని శివసాగర్‌ చెరువు ఆధునికరణకు ప్రణాళికలు, డీపీఆర్‌ సిద్ధం చేయాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం చైర్‌ పర్సన్‌ గడ్డం అనన్యతో కలిసి చెరువు పరిసరాలను పరిశీలించారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ఎన్నెపల్లిలోని షాదీఖానాను పరిశీలించి మరమ్మతులు చేయించాలని సూచించారు. ఆయన వెంట అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌ రెడ్డి, కమిషనర్‌ విక్రమ్‌ సింహారెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

నలుగురికి రిమాండ్‌

యాలాల: పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై నలుగురు కత్తి, కర్రతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలోని కోకట్‌ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన జోగు శ్రీకాంత్‌కు అదే గ్రామానికి చెందిన రాస్నం అశోక్‌కు పాత గొడవలున్నాయి. వాటిని మనసులో పెట్టుకున్న రాస్నం అశోక్‌తో పాటు రాస్నం ప్రకాష్‌, రొంపల్లి నరేష్‌, బషీరాబాద్‌ మండలం కాసీంపూర్‌కు చెందిన నర్సింలు జోగు శ్రీకాంత్‌తో గొడవకు దిగారు. శ్రీకాంత్‌పై అశోక్‌ కత్తితో పాటు కర్రతో దాడికి దిగాడు. శ్రీకాంత్‌ తల భాగంతో పాటు నడుముకు గాయాలయ్యాయి. బాధితుడు తండ్రి భీమప్ప ఫిర్యాదు మేరకు నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement