అసంపూర్తిగానే..
పనులు పూర్తి చేయాలి
మొత్తం వార్డులు 12
విలీన గ్రామాలు 06
జనాభా 20,000
ఓటర్లు 12,000
కొడంగల్‌లో అధ్వానంగా అంతర్గత రోడ్లు
పైప్‌లైన్ల కోసం తవ్వి వదిలేస్తున్న వైనం
పలు కాలనీల్లో తప్పని తిప్పలు
తరచూ ప్రమాదాలు
కొడంగల్: మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో చోటుచేసుకుంటున్న జాప్యం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. రోడ్లను తవ్వి నెలల తరబడి అలాగే వదిలేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ తదితర వాటి కోసం తవ్వకాలు చేపట్టి, సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంతో అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. ఫలితంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొడంగల్‌లోని పలు కాలనీలతో పాటు విలీన గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
కార్గిల్ కాలనీ, ఇంద్రనగర్ కాలనీ, శాంతినగర్, తెలుగుగేరి, కలాల్‌వాడ, గాంధీనగర్, ఆర్యనగర్, బూల్కాపూర్, కొండారెడ్డిపల్లిలో సీసీ రోడ్లను ఇష్టాజారాజ్యగా తవ్వేశారు.
వర్షం కురిస్తే దారి మొత్తం చిత్తడిగా మారుతోంది.
ఇళ్లలో వాడిన నీరు రోడ్లపైకి వస్తోంది. ఈ విషయంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని బాలాజీనగర్ పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు అధ్వానంగా ఉంది.
వినాయక చౌరస్తా నుంచి బాలాజీనగర్‌కు వెళ్లేదారిలో గుంతలు పడ్డాయి. గతంలో పలుమార్లు మరమ్మతులు చేశారు. పూర్తి స్థాయిలో పనులు చేయకపోవడంతో అవస్థలు తప్పడం లేదు.
సంతబజార్ నుంచి తెలుగుగేరికి వెళ్లే దారిదీ ఇదే పరిస్థితి.
గాంధీనగర్ నుంచి ఆర్యనగర్ వెళ్లే దారిలో గుంతలు పడ్డాయి.
తూర్పు కమాన్ నుంచి ఆర్యనగర్‌కు వెళ్లే దారి, బస్టాండ్ నుంచి శాంతినగర్ కాలనీ, ఇంద్రనగర్ కాలనీలో రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది.
బూల్కాపూర్‌లో అంతర్గత రోడ్లు దరిద్రంగా మారాయి. మురుగు కాల్వల నిర్మాణం అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఇందులో పడి పశువులతో పాటు మనుషులు సైతం గాయపడుతున్నారు. రోడ్డు పక్కన గుంత తవ్వి వదిలేశారు.
– చంద్రమౌళి, బూల్కాపూర్
పూర్తి స్థాయిలో రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాలి. గుడి దగ్గర ఇళ్లలో వాడిన నీరు రోడ్డుపైకి వస్తోంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. మున్సిపల్‌లో కలిసిన తర్వాత బూల్కాపూర్ గ్రామం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
– భీములు


