● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్
● ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం
అనంతగిరి: ప్రధాని మోదీ పాలనలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని గౌలికార్ ఫంక్షన్ హాల్‌లో మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోకట్ మాధవరెడ్డి, శివరాజు ఇతర నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడుతున్న ఘనత ప్రధానికే దక్కుతుందన్నారు. అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ దూసుకుపోతోందన్నారు. వరుసగా మూడు సార్లు ప్రధాని అయ్యి రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చరణ్‌రెడ్డి, కౌన్సిలర్లు అనిల్ యాదవ్, లావణ్య, స్రవంతిరెడ్డి, చిట్యాల రుచితారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు వివేకానంద్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుల్కచర్లలో..
కుల్కచర్ల: ప్రపంచం మెచ్చిన నేత ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు అన్నారు. మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలోనే దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందన్నారు. కార్యక్రమంలో దిశ కమిటీ జిల్లా సభ్యులు జానకిరాం, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రజాక్ పాషా, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సౌమ్యారెడ్డి, సర్పంచ్ అంజిలయ్య, ఉప సర్పంచ్ విజయకుమార్, నాయకులు మల్లేశ్, కర్ణయ్య, మహేశ్, లాలు, హన్మంతు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


