పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మెఘావత్ రాజు
మర్పల్లి: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని ఆ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు, గుర్రం గట్టు తండా సర్పంచ్ రాజు అన్నారు. బుధవారం పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇందిర గాంధీ హయాంలో ఎస్టీల సంక్షేమానికి అనేక పథకాలు అమలైనట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో కాలనీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు, అసైన్డ్ పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించారని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తండాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు సుభాష్ యాదవ్, రవీందర్, నాగేశ్, సురేశ్, దివాకర్, పాండు నాయక్, రఘు, పట్లూర్ సర్పంచ్ పరశురాం, గుర్రంగట్టు తండా ఉప సర్పంచ్ సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.


