20న జిల్లాకు కవిత | - | Sakshi
Sakshi News home page

20న జిల్లాకు కవిత

Sep 17 2026 8:35 AM | Updated on Sep 17 2026 8:35 AM

20న జిల్లాకు కవిత

బొంరాస్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌ నుంచి రోడ్‌షో నిర్వహించేందకు తెలంగాణ రక్షణ సేవ(టీఆర్‌ఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సిద్ధమయ్యారు. పాంచజన్య సంకల్ప యాత్రలో భాగంగా ఈ నెల 20న రోడ్‌ షో, పార్టీ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. సాయంత్రం కోస్గి పట్టణంలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 10గంటలకు బొంరాస్‌పేట మండలంలోని జాతీయ రహదారి వద్ద కవితకు పార్టీ నాయకులు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి తుంకిమెట్ల వరకు రోడ్‌షో ఉండనుంది. నాగిరెడ్డిపల్లి, రేగడిమైలారం మీదుగా కొడంగల్‌కు భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా వస్తారు. పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి దుద్యాల మండలం హస్నాబాద్‌, దుద్యాల గేట్‌ మీదుగా కోస్గి పట్టణానికి చేరుకుంటారు. ఇందు కోసం భారీ జనసమీకరణ చేయనున్నట్లు తెలిసింది.

బొంరాస్‌పేట, కొడంగల్‌, దుద్యాల మండలాల్లో రోడ్‌షో

కోస్గి పట్టణంలో టీఆర్‌ఎస్‌ పాంచజన్య సంకల్ప సభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement