బషీరాబాద్: మండలంలోని నావంద్గీ సహకార సంఘంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సొసైటీ వైస్ చైర్మన్‌గా ఆరున్నరేళ్లపాటు పనిచేసిన అజయ్ ప్రసాద్ తన డైరెక్టర్ పదవితోపాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత నెల 25న తన రాజీనామా లేఖను సొసైటీ సీఈఓ వెంకటయ్యకు అందజేయగా, బుధవారం జరిగిన పాలకవర్గం మేనేజింగ్ కమిటీ (ఎంసీ) సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదించినట్లు సీఈఓ తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కు ముఖ్య అనుచరుడిగా పేరున్న అజయ్‌నప్రసాద్‌కు నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ పదవి దక్కే అవకాశం వచ్చింది. అయితే పార్టీలో అంతర్గత పరిణామాలతో ఆ అవకాశం దూరమైంది. ఈ నేపథ్యంలోనే అజయ్ ప్రసాద్ రాజీనామా చేసిఉండొచ్చని రాజకీయ విశ్లేశణలు వినిపించాయి. మరోవైపు ఎ మ్మెల్యే మనోహర్‌రెడ్డి సూచనల మేరకే ఆయన రాజీనామా చేశారని, త్వరలోనే రాష్ట్ర స్థాయిలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని ఆయన వర్గీయులు పే ర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సొసైటీలో మొత్తం 13 మంది డైరెక్టర్లకు గాను నవీన్‌రెడ్డి, అనసూయభాయి గత ఏడాది డిసెంబర్‌లో సర్పంచులుగా ఎన్నిక కావడంతో అప్పట్లో డైరెక్టర్ పతవులకు రాజీనామా చేశారు. మరో సభ్ యుడు రూప్లానాయక్ మృతి చెందగా, అనారోగ్య కారణాలతో నర్సిరెడ్డి సమావేశాలకు దూరమయ్యారు. గోపాల్‌రెడ్డి కూడా అనారోగ్యంతో క్రియాశీలకంగా లేరు. తాజాగా అజయ్ ప్రసాద్ రాజీనామాతో పాలకవర్గంలో క్రియాశీల సభ్యుల సంఖ్య ఏడుకు చేరింది. ఇందులో కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్‌ఎస్ నుంచి ముగ్గురు డైరెక్టర్‌లున్నారు.
ఆమోదించిన పాలకవర్గం


