తాండూరు టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్) తాండూరు జోన్ అండర్ –14 క్రికెట్ జట్టు ఎంపిక బుధవారం జరిగింది. పట్టణ శివారులోని గౌతమీ మోడల్ స్కూల్ మైదానంలో నిర్వహించిన క్రికెట్ సెలక్షన్స్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. తాండూరు జోన్ నుంచి 19 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జోన్ ఇన్‌చార్జి రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో అండర్ 14, 17 జట్లను ఎంపిక చేశామన్నారు. వీరు తదుపరి జిల్లా పరిఽధిలోని పలు జోనల్ జట్లచే పోటీ పడనున్నట్లు చెప్పారు. ఈ ఎంపికలో పీఈటీలు రాజశేఖర్ రెడ్డి, అంబదాస్, గంగన్న, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జోనల్ స్థాయి జట్టు ఎంపిక
యాలాల: అండర్ –17 జోనల్ స్థాయి క్రికెట్ జట్టును ఎంపిక చేసినట్లు తాండూరు జోనల్ కార్యదర్శి రాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గౌతమి పాఠశాల ఆవరణలో నిర్వహించిన ప్రక్రియలో అండర్–17 జట్టును ఎంపిక చేశామన్నారు. పరిగి పట్టణంలో జరుగనున్న జిల్లా స్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొననుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ మాజీ కార్యదర్శి అనంతయ్య, పీడీలు గంగన్న, రాజశేఖరరెడ్డి, అంబదాస్, రవీందర్‌రెడ్డి, రవికుమార్, భాస్కర్, శివ, మహేందర్, నరేష్ తదితరులు ఉన్నారు.


