మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణం కాపాడుదాం | - | Sakshi
Sakshi News home page

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణం కాపాడుదాం

Sep 13 2026 11:27 AM | Updated on Sep 13 2026 11:27 AM

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణం కాపాడుదాం పరిగి: మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని పీసీసీ మెంబర్‌ టి.రితీక్‌రెడ్డి సూచించారు. శనివారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరు పాలు పంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమారామ్మోహన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పార్థసారథి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత తదితరులు పాల్గొన్నారు.

పీసీసీ మెంబర్‌ రితీక్‌రెడ్డి

మంత్రి సీతక్కకు సన్మానం

చేవెళ్ల: పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా మహిళా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్య క్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభవన్‌లో మంత్రిని కలిసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సర్పంచుల సంఘం అధ్యక్షురాలు తిప్పని మాధవిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు

చేవెళ్ల: ప్రజల్లో కాంగ్రెస్‌పార్టీకి ఆదరణ లేదనే భయంతో ఎన్నికలకు వెళ్లకుండా సొసైటీ పదవులను నామినేటెడ్‌ పద్ధతిలో కట్టబెడుతున్నారని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ మాల్గారి వైభవ్‌రెడ్డి విమర్శించారు. చేవెళ్లలో శనివారం ఆయన బీజేవైఎం నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు. ప్రజా స్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే దమ్ము లేద న్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, పార్టీ గుర్తుపై ఎన్నికలకు వెళ్తే తిరస్కరిస్తా రనే భయం పట్టుకుందన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

పౌష్టికాహారంతో

సంపూర్ణ ఆరోగ్యం

కుల్కచర్ల: పౌష్టికాహారంతోనే తల్లీబిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కామునిపల్లి అంగన్‌వాడీ టీచర్‌ పండరీబాయి అన్నారు. శనివారం కామునిపల్లి గ్రామంలో పోషణమాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు వ్యక్తిగత స్వచ్ఛతను పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. వైద్యసిబ్బంది సూచనలను పాటించడంతో వ్యాధులబారినపడకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విదేశీ పర్యటనకు

నాగరాజు ఎంపిక

పూడూరు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విదేశీ ఎక్స్‌పోజర్‌ పర్యటన (ఫారన్‌ ఎక్స్‌ పోజర్‌ విజిట్‌)లో భాగంగా సింగపూర్‌ పర్యటనకు మండల పరిధి కొత్తపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బెన్నూరు నాగరాజుకు అవకాశం దక్కింది. ఈ సందర్భంగా ఎంఈఓ వి.సాయిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధికి, ఆధునిక బోధనా పద్ధతుల పరిశీలనకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశం ఎంతో దోహదపడనుందని పేర్కొన్నారు. అనంతరం నాగరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement