మణికొండ: వ్యాపార, పారిశ్రమ, ఆసుపత్రి, నిర్మాణ, ఫార్మా తదితర రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న 60 మంది ప్రముఖులకు హైబిజ్ టీవీ అవార్డులను అందజేసింది. నార్సింగి సర్కిల్ గౌలిదొడ్డిలోని ప్రధాన్ కన్వెన్షన్‌లో శనివారం రాత్రి ఈ వేడుక నిర్వహించారు. అంతకు ముందు 60 మంది ప్రముఖుల జీవిత విశేషాల ఇంటర్వూలతో సిద్ధం చేసిన కాఫీ టేబుల్ బుక్‌ను ఏపీ మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు. అనంతరం భారతి సిమెంట్ మార్కెటింగ్ జీఎం రవీందర్‌రెడ్డి, శాంత బయోటెక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌రెడ్డి, సియాసత్ ఉర్దూ ప్రతిక ఎడిటర్ జాహీద్ ఆలీఖాన్, కరాచీ బేకరీ ఎంీడీ లేక్‌రాజ్, ప్రగతి రిసార్ట్ చైర్మెన్ జీబీకే, జనప్రియ బిల్డర్స్ రవీందర్‌రెడ్డి తదితరులకు అవార్డులు అందజేశారు.


