సిటీ కోర్టులు: రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 1,65,000 పైగా కేసులు పరిష్కరించామని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ తెలిపారు. 33 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ, ప్రీ–లిటిగేషన్ తదితర రాజీకి అనుకూలమైన కేసులను పరిష్కరించామన్నారు. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన ఓ జంటకు కౌన్సెలింగ్ నిర్వహించగా, మనస్పర్థలు వీడి కలిసి జీవించేందుకు అంగీకరించారని తెలిపారు. దీంతో ఓ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా వారిని లోక్‌అదాలత్ కలిపిందని స్పష్టంచేశారు. శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఈఆర్‌జీఓ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా మోటారు వాహన ప్రమాద కేసుల బాధితులకు రూ.80 లక్షల నష్టపరిహారం ఇప్పించారు. అన్ని కేసులలో కలిపి రూ.10 కోట్ల, 3 లక్షల 33 వేల నష్ట పరిహారాన్ని కక్షిదారులకు అందజేసినట్లు తెలిపారు.
33 బెంచీల్లో జాతీయ లోక్ అదాలత్
కక్షిదారులకు రూ.10,03,33,000 పరిహారం అందజేత
రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్


