అరెస్టులు అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

అరెస్టులు అప్రజాస్వామికం

Sep 4 2026 7:29 AM | Updated on Sep 4 2026 7:29 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్‌

రాంచంద్‌రావు అరెస్టును నిరసిస్తూ వికారాబాద్‌లో ధర్నా

అనంతగిరి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును అక్రమంగా అరెస్టు చేయడం సరైంది కాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్‌ అన్నారు. నల్గొండలో బీజేపీ నేత ఇంటిపై కాంగ్రెస్‌ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ, పరామర్శకు బయలుదేరిన ఆయనను నగరంలో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వికారాబాద్‌లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో దాడులు సరైన పద్ధతి కాదన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసన చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేసి వికారాబాద్‌ పీఎస్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, సీనియర్‌ నాయకులు శ్రీధర్‌రెడ్డి, చరణ్‌రెడ్డి, రాజు, పాండుగౌడ్‌, వివేకానందారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అమర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement