మురికికూపంలా తాండూరు బస్టాండ్
తాండూరు: నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే తాండూరులోని ఆర్టీసీ బస్టాండ్ అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఈప్రాంగణంలోనే వంద బస్సులతో డిపో కూడా కొనసాగుతోంది. 355 మంది ఉద్యోగులు విధులు ని ర్వర్తిస్తుండగా.. 35 రూట్ల ద్వారా ప్రతిరోజు 35 వేల నుంచి 40 వేల మంది ప్రయాణికులు గ మ్యస్థానాలకు వెళ్తుంటారు.. ఇలా ఆర్టీసీకి ని త్యం రూ.16 లక్షలు, బస్టాండ్ ప్రాంగణంలోని దుకాణాల ద్వారా ప్రతినెలా రూ.3 లక్షల ఆదా యం సమకూరుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా బస్టాండ్‌లోకి వెళ్లే ప్రధాన దారితో పాటు పరిసరాలు మురుగు కూపాన్ని తలపిస్తున్నా యి. ఎక్కడ చూసినా పందులు, కుక్కల సంచా రం, చెత్తాచెదారం దర్శనమిస్తోంది. భరించలేని కంపుతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు.


