మండలాల వారీగా విడుదలైన నిధులు | - | Sakshi
Sakshi News home page

మండలాల వారీగా విడుదలైన నిధులు

Aug 4 2026 9:54 AM | Updated on Aug 4 2026 9:54 AM

బషీరాబాద్‌: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2024 – 25 సంవత్సరానికి గాను జిల్లాలోని 594(16 గ్రామాలు మినహా) జీపీలకు రూ.24.23 కోట్లు జమయ్యాయి. ఈ నిధులను తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు. కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీలు రోజువారీ నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాగునీటి మోటార్ల మరమ్మతులు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, చెత్త సేకరణ వాహనాల నిర్వహణ వంటి పనులకు నిధుల కొరత ఏర్పడింది. తాజాగా విడుదలైన గ్రాంట్లతో గ్రామాల్లో అత్యవసర పనులకు కొంత మేర పరిష్కారం లభించనుంది. ప్రధానంగా గ్రామాల్లో తాగునీటి వసతుల మెరుగుదల, పైప్‌లైన్ల మరమ్మతులు, బోర్లు, నీటి మోటార్ల నిర్వహణ, మురుగు కాలువలను శుభ్రం చేయించడం, చెత్త సేకరణ వ్యవస్థ బలోపేతం, పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు.

ఆన్‌లైన్‌ కాక..

జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలు ఉండగా, ఈ విడతలో 578 జీపీలకే నిధులు అందాయి. మిగిలిన 16 వాటికి గ్రాంట్‌ అందలేదు. నిధుల విడుదల సమయంలో కొన్ని జీపీల బ్యాంక్‌ ఖాతాలు ఆన్‌లైన్‌ వ్యవస్థకు అనుసంధానం కాకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నిధులు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యలు పరిష్కరించిన అనంతరం తదుపరి విడతలో ఆయా గ్రామాలకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే

15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో పారదర్శకతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి రూపాయి ఖర్చుకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. చేపట్టిన పనులు, చెల్లింపులు, పనుల పురోగతిని డిజిటల్‌ విధానంలో నమోదు చేయాల్సి ఉంటుంది. నిధులను నిబంధనలకు అనుగుణంగా వినియోగిస్తున్నారా లేదా అనే అంశంపై జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించనున్నారు. గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే పనులకే నిధులను వినియోగించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిధుల సక్రమ వినియోగంతో మౌలిక వసతులు మెరుగుపడటమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది.

మండలం జీపీలు నిధులు

(రూ.లక్షల్లో..)

బంట్వారం 11 56.63

బషీరాబాద్‌ 36 134.90

బొంరాస్‌పేట 33 118.60

చౌడాపూర్‌ 24 87.30

ధారూరు 33 125.65

దోమ 36 154.29

దౌల్తాబాద్‌ 31 143.41

దుద్యాల్‌ 19 70.57

కొడంగల్‌ 25 119.13

కోట్‌పల్లి 18 68.34

కుల్కచర్ల 32 137.56

మర్పల్లి 28 160.45

మోమిన్‌పేట 28 140.40

నవాబుపేట 32 129.50

పరిగి 32 115.26

పెద్దేముల్‌ 37 145.59

పూడూరు 31 136.37

తాండూరు 33 158.96

వికారాబాద్‌ 21 84.00

యాలాల 38 136.45

578 24.23 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement