అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు డీటీసీపీ అనుమతులు ఉన్న సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో తప్పుగా నమోదు చేయడం జరిగిందని, వాటిని తీసేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. సోమవారం బాధితులతో కలిసి కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని అనుమతులు ఉన్న పలు సర్వే నంబర్లను పీఓపీలో పెట్టడంతో ప్రజలు క్రయ, విక్రయాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ తప్పు జరిగిందో వెంటనే గుర్తించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, బాధితులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.


