తాండూరు టు అరుణాచలం | - | Sakshi
Sakshi News home page

తాండూరు టు అరుణాచలం

Jul 30 2026 7:24 AM | Updated on Jul 30 2026 7:24 AM

ఆగస్టు 3నుంచి ఆర్టీసీ డీలక్స్‌ బస్సు

ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి

డిపో మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌

తాండూరు టౌన్‌: తాండూరు నుంచి అరుణాచల క్షేత్రానికి ఆర్టీసీ డీలక్స్‌ బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు అరుణాచలం ఆధ్యాత్మిక యాత్ర కొనసాగనున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు సాగే ఈ యాత్రకు ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. పెద్దలకు రూ.3,600, పిల్లలకు హాఫ్‌ టికెట్‌ రూ.2 వేలు ఉంటుందన్నారు. రాత్రి 9గంటలకు తాండూరు నుంచి బస్సు బయలుదేరి కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, తమిళనాడు వేలూరులోని గోల్డెన్‌ టెంపుల్‌, తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి దర్శనం కల్పిస్తారన్నారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. 5వ తేదీ సాయంత్రం 5గంటలకు తిరుగు ప్రయాణం ఉంటుందని, 6వ తేదీ ఉదయం వరకు తాండూరుకు చేరుకుంటారన్నారు. ఆలయ దర్శనం, భోజనం, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందన్నారు. టికెట్ల బుకింగ్‌ కోసం సెల్‌ నంబర్‌ 9948947422, 8309348157లలో సంప్రదించాలన్నారు. ఈ ఆధ్యాత్మిక యాత్రను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement