మళ్లీ తడబాటే.. | - | Sakshi
Sakshi News home page

మళ్లీ తడబాటే..

Apr 13 2026 8:14 AM | Updated on Apr 13 2026 8:14 AM

ఇంటర్‌ ఫలితాల్లో మరింత వెనుకబాటు

ఇంటర్‌ ఫలితాల్లో మరింత వెనుకబాటు

వికారాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారింది. గతంతో పోలి స్తే స్థానం పరంగా ఇంటర్‌లో జిల్లా విద్యార్థులు మరింత పతనాన్ని నమో దు చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలను తీసుకుంటే జిల్లా పరిస్థితి స్థానా లు గతంతో పోలిస్తే మరింత దిగజారాయి. పర్సెంటేజీ పరంగా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో గతే డాది కన్నా మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఆది వారం రాష్ట్ర విద్యాశాఖ ఇంటర్‌ ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో జిల్లా ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో వెనకంజ వేయడం గమనార్హం. మొదటి సంవత్సరం 31వ, రెండవ సంవత్సరం 25వ స్థానాల్లో నిలవడంతో మధ్య బెంచీ, వెనుకబెంచీ స్టూడెంట్స్‌గా పేరుతెచ్చుకున్నట్టయింది. ఈ ఏడాది సైతం గతం మాదిరిగా విద్యార్థులు అత్తెసరు మార్కులే సాధించారు. గతేడాదితో ప్రస్తుత ఫలితాలు విశ్లేషిస్తే రాష్ట్ర స్థాయిలో స్థానాల పరంగా దిగజారగా పర్సెంటేజీ పరంగా మాత్రం రెండవ సంవత్సరంలో కాస్త మెరుగయింది. రాష్ట్ర స్థాయిలో మాదిరిగా జిల్లా ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించారు. గతేడాది ప్రథమ సంవత్సరంలో 16వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 31వ స్థానానికి, రెండో సంవత్సరం గతేడాది 24వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 25వ స్థానానికి చేరింది. ఒకేషనల్‌ కోర్సుల్లోనూ గతేడాది కన్నా ఉత్తీర్ణత శాతం తగ్గింది. మొత్తంగా ఈ ఏడాది ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో బాలికలు 62.87 శాతం, బాలురు 41.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 75.91 శాతం, బాలురు 60.98 శాతంతో ఉత్తీర్ణులయ్యారు.

పర్యవేక్షణ లోపం

ఇంటర్‌ ఫలితాల్లో వెనుకబాటుకు అధికారుల పర్యవేక్షణలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నోడల్‌ అధికారి పోస్టు సైతం ఖాళీగా ఉంది. దీంతో వికారాబాద్‌ కళాశాల ప్రిన్సిపాల్‌కే ఆ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇతర కళాశాలలను సందర్శించిన దా ఖలాలు లేవు. ఇంటర్‌ బోర్డు అధికారులైతే ఏడాదికో సారి కూడా ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదు. కలెక్టర్‌ తదితర ఉన్నత అధికారులు పాఠశాలలను, హాస్టళ్లను అప్పుడప్పుడు పర్యవేక్షిస్తుండగా కళాశాలలను ఎవరు పట్టించుకోలేదు. ప్రతి ఏటా ఫలితాల పరంగా జిల్లా వెనకబాటుకు గురవుతున్నా.. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు.

ఎల్‌.గీత, ఎంపీసీ, 467

సి.శ్రావణి, బైపీసీ, 438

దీక్షిత, ఎంపీసీ ద్వితీయ, 990

రాష్ట్ర స్థాయిలో ప్రథమ సంవత్సరంలో 16వ స్థానం నుంచి 31వ స్థానానికి పడిపోయిన జిల్లా

సెకండియర్‌లో 24 నుంచి 25కు

ఫస్టియర్‌లో 52.74, సెకండ్‌ ఇయర్‌లో 69.23 ఉత్తీర్ణత శాతం

ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలదే పైచేయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement