మీర్‌పేట: ఓ కేసు విషయమై ఫిర్యాదుదారు డిని మద్యం బాటిళ్లు అడిగిన మీర్‌పేట సబ్ ఇన్‌స్పెక్టర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో బాటిళ్లు అడిగిన ఆడియో వైరల్ కావడంతో హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు ఎస్‌ఐను ఆదివారం హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఇన్‌స్పెక్టర్ శంకర్‌నాయక్, ఫిర్యాదుదారుడి కథనం ప్రకారం.. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధి లెనిన్‌నగర్‌కు చెందిన తిరుపతయ్య గతంలో వెంకటేశ్ అనే వ్యక్తి వద్ద 11.05 గజాల స్థలంలో ఉన్న షెటర్‌ను కొనుగోలు చేశాడు. ఇటీవల అమ్మిన వ్యక్తి కుటుంబ సభ్యులు షెటర్‌పైన నిర్మాణం చేపట్టడంతో తన 2 గజాల స్థలాన్ని ఆక్రమించారని, అడిగితే గొడవకు దిగుతున్నారని.. తనకు న్యాయం చేయాలని ఈ నెల 5న తిరుపతయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఇదిలా ఉండగా ఈ నెల 10న ఎస్‌ఐ నాగభూషణం తిరుపతయ్యకు ఫోన్ చేసి రెండు మద్యం బాటిళ్లు అడిగాడు. ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం చేయకపోగా మద్యం బాటిళ్లు అడిగారని తిరుపతయ్య ఆరోపించాడు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరాడు. కాగా, అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ ఆదేశాల మేరకు ఎస్‌ఐ నాగభూషణంను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసినట్టు ఇన్‌స్పెక్టర్ శంకర్‌నాయక్ తెలిపారు. పూర్తిగా విచారణ చేపట్టి రెండు రోజుల్లో నివేదికను సమర్పించాల్సిందిగా సీపీ శంషాబాద్ డీసీపీని ఆదేశించినట్టు చెప్పారు. స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లు తిరిగి ఇవ్వడానికి పోలీసు సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంపై ఇన్‌స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా అది పదేళ్ల క్రితం నాటిదని, దీనిపై పూర్తిగా విచారిస్తున్నామని బదులిచ్చారు.
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ ఉద్యమ కారుడు, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు కర్నె అరవింద్ (35) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. వికారాబాద్‌లో జరిగిన బావమరిది వివాహ వేడుకలకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ఆయన వివాహం అయిన వెంటనే పెళ్లి పందిరిలోనే కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచారు. సాయంత్రం ఇబ్ర హీంపట్నంలో అంత్యక్రియలు నిర్వహించారు. అరవింద్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సోద రుడి కుమారుడు. తెలంగాణ ఉద్యమంతో పాటు, బీఆర్‌ఎస్ట్‌లో చురుకైన పాత్ర పోషించారు. ఇటీవల మీడియా స్పోక్స్ పర్సన్‌గా వ్యవహరించారు. అరవింద్ మృతికి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, క్యామా మల్లేష్ నివాళి అర్పించారు.


