వారిపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

వారిపై చర్యలు తీసుకోండి

Apr 13 2026 8:14 AM | Updated on Apr 13 2026 8:14 AM

తాండూరు: రాజ్‌పుత్‌ సమాజానికి కేటాయించిన స్థలంలోనే భవన నిర్మాణం చేపట్టేందుకు నిధులు అందజేస్తానని శాసన మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 5వ వార్డులో రాజ్‌పుత్‌ సమాజం భవన నిర్మాణం కోసం గతంలో పట్నం మహేందర్‌రెడ్డి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణం కోసం శిలా ఫలకం వేసి శంకుస్థాపన చేశారు. కాగా శనివారం గుర్తు తెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న సమాజం ప్రతినిధులు మండలి చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆదివారం ఆయన రాజ్‌పుత్‌ సమాజం సభ్యులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ సీఐ పరమేశ్వర్‌ను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ.. తాండూరు ప్రాంతంలోని రాజ్‌పుత్‌ల కోసం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. వారికి కేటాయించిన స్థలంలో అభివృద్ది చేసుకోలేకపోయారన్నారు. త్వరలోనే భవన నిర్మాణానికి నిధులు అందజేస్తామన్నారు. ఆయన వెంట రాజ్‌పుత్‌ సమాజం అధ్యక్షుడు దిలీప్‌సింగ్‌ ఠాకూర్‌, గౌరవ అధ్యక్షుడు సుభాశ్‌సింగ్‌ ఠాకూర్‌, ప్రతినిధులు, సమాజం సభ్యులు తదితరులున్నారు.

రాజ్‌పుత్‌ సమాజం భవన నిర్మాణానికి నిధులు అందజేస్తా

మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement