దౌల్తాబాద్: మండలంలోని గోకఫసల్‌వాద్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్, మమత వివాహం ఆదివారం దౌల్తాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, జిల్లా, నియోజకవర్గ, స్థానిక నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
రేపు ఆలయ భూముల కౌలుకు వేలం
పూడూరు: రాకంచర్ల యోగానంద లక్ష్మీనృసింహ స్వామి(తిరుమలనాథ స్వామి) ఆలయ భూముల కౌలుకు ఈ నెల 14న వేలం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ యాదయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2026–2029 వరకు 22.20 ఎకరాల కౌలుకు ఈ వేలం ఉంటుందని చెప్పారు. పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో 398 సర్వే నంబర్‌లో 6.16 ఎకరాలు, సర్వే నంబర్ 278లో 27 గుంటలు, సర్వే నంబర్ 402లో 7.18 ఎకరాలు, మంచన్‌పల్లి గ్రామంలో సర్వే నంబర్ 67లో 7.29 ఎకరాలకు సంబంధించి ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందన్నారు. వేలంలో పాల్గొనదలచిన రైతులు రూ.2వేల ధరావతు చెల్లించాలన్నారు.
‘చలో కిష్టాపూర్’ను విజయవంతం చేయండి
ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్
పరిగి: అంబేడ్కర్ ఆలోచనలు, తెలంగాణ ఉద్యమ అంశాలపై చర్చించేందుకు నిర్వహిస్తున్ను చలో కిష్టాపూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పట్టణ కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన దోమ మండల పరిధిలోని కిష్టాపూర్‌లో మాతృభూమి అభివృద్ధి సేవా సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనలు, తెలంగాణ ఉద్యమంలో జరిగిన అంశాలపై చర్చించేందుకు సమయాత్తమయ్యామన్నారు. ఈ కార్యక్రమానికి మహాత్మ జ్యోతిరావు పూలే మునిమనవరాలు నీతపూలే ముఖ్యఅతిథిగా హాజరవనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, యువకులు, ప్రజాసంఘాల నేతలు, పార్టీలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు అడ్వకేట్ ఆనంద్‌గౌడ్, పోరాటాల రామన్నమాదిగ, మాలి విజయ్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రాములు, అంతిగారి విద్యాసాగర్, సత్తయ్య టీచర్, పీర్ మహ్మద్, రమేశ్‌గౌడ్, రాజేశ్, జేఏసీ రవి, గోవింద్‌నాయక్, కృష్ణమహరాజ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
షాబాద్: మండలంలోని మన్‌మర్రి గ్రామాన్ని ఆదివారం అమెరికాకు చెందిన మినర్వా యూనివర్సిటీలో చదువుకుంటున్న 17 దేశాలకు చెందిన 25 మంది విద్యార్థుల బృందం సందర్శించింది. గ్రామంలోని వాటర్ ప్లాంట్, ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని విద్యార్థులు పరిశీలించారు. వాటర్ ప్లాంట్‌తో ఉపయోగాలు, గ్రామస్తులకు స్వచ్ఛమైన నీరు అందించడం తదితర విషయాలను వాటర్ సంస్థ ప్రతినిధులను అగిడి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంపై అంగన్‌వాడీ టీచర్ గిరిజ వివరించారు. ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నట్లు సర్పంచ్ లాలాపేట్ బందయ్య తెలిపారు. వారివెంట ఉపసర్పంచ్ బేగరి శంకరయ్య, వార్డు సభ్యులు నర్సింలు, వెంకటేశ్, జంగిలయ్య, కారోబార్ పరమేష్, తదితరులు ఉన్నారు.


