చట్టాలపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన తప్పనిసరి

Mar 7 2026 10:14 AM | Updated on Mar 7 2026 10:14 AM

ఇన్‌స్పైర్‌ మనక్‌కు ఎంపిక

షీటీం ఇన్‌చార్జి నర్సింహులు

దోమ: విద్యార్థులకు చట్టాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని షీటీం ఇన్‌చార్జి నర్సింహులు అన్నారు. శుక్రవారం మండల పరిధి గుండాల జిల్లా పరిషత్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డితో కలసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, బాల్య వివాహాలను అరికట్టేందుకు కృషి చేయాలని సూచించారు. అతివలపై ఎలాంటి దాడులు జరిగినా వెంటనే 100, 181కు కాల్‌ చేయాలని చెప్పారు. బ్యాంకింగ్‌ ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించాలన్నారు. సైబర్‌ క్రైంలో ఎలాంటి మోసాలు జరిగినా 1930కి కాల్‌ చేయాలని కోరారు.

9న జాతీయ

అప్రెంటీస్‌షిప్‌ మేళా

షాద్‌నగర్‌: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 9న జాతీయ అప్రెంటీస్‌షిప్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌ ఒక ప్రటకనలో పేర్కొన్నారు. ఈ మేళా ద్వార ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో అప్రెంటీస్‌షిప్‌ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించే మేళాకు ఆసక్తి కలిగిన ఐటీఐ పాసైన విద్యార్థులు తమ బయోడేటా, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో హాజరుకావాలని చెప్పారు. ఆన్‌లైన్‌ అప్రెంటీస్‌షిప్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను విధిగా తేవాలన్నారు. బీఎల్‌ఈ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ, రాడంట్‌ అప్లయెన్సెస్‌, ప్రగతి ఆర్‌ఆర్‌డీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆక్రమ్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, షనైడర్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఒలెక్ట్రా మోటార్స్‌, అపెక్స్‌ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ వారు హాజరువుతున్నట్లు తెలిపారు. వివరాలకు 80748 16395, 80192 63018 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

షాద్‌నగర్‌రూరల్‌: ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని కమ్మదనం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డు 2025–26కు ఎంపికయ్యారు. గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శాలిని, సహస్ర తమ వినూత్న ఆవిష్కరణలు, ఆలోచనలతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద ప్రతి విద్యార్థికి ప్రాజెక్టు అభివృద్ధికోసం ప్రభుత్వం రూ. 10వేలు మంజూరు చేస్తుంది. అవార్డుకు ఎంపికై న విద్యార్థినులలు, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయురాలిని శుక్రవారం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ శారద, ఉపాధ్యాయులు అభినందించారు.

పరామర్శ

మొయినాబాద్‌: గౌడకుల హక్కుల పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు బస్వపురం అంజయ్యగౌడ్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరామర్శించారు. ఇటీవల అంజయ్యగౌడ్‌ తండ్రి కిష్టయ్యగౌడ్‌ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం అంజయ్యగౌడ్‌ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట గౌడకుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రేనట్ల మల్లేశ్‌గౌడ్‌, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కౌకుంట్ల మల్లేశ్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

ప్రజల ఆరోగ్య రక్షణకు కృషి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అధికారి డాక్టర్‌ నరేందర్‌కుమార్‌ అన్నారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మొదటి రోజు మండలంలోని ఎల్మినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి, దంత, సీ్త్ర సంబంధిత వ్యాధులకు సంబంధించిన చికిత్సలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ నరేందర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 99 రోజుల పాటు వివిధ రకాల ఆరోగ్య రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ యాదమ్మ, వార్డు సభ్యుడు నర్సింహ, డాక్టర్‌ నాగేంద్రబాబు, డాక్టర్‌ కృష్ణ, లక్ష్మీప్రసన్న, పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ మోహన్‌, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement