అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి

Mar 7 2026 10:14 AM | Updated on Mar 7 2026 10:14 AM

పహాడీషరీఫ్‌: అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి చెందిన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం వావిల్కోలు గ్రామానికి చెందిన మేకల గీత (35), వెంకటయ్య దంపతులు రెండేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం తుక్కుగూడకు వలస వచ్చారు. గీత స్థానిక హాస్టల్‌లో, భర్త కర్రీ పాయింట్‌లో పని చేస్తున్నాడు. గురువారం రాత్రి 11 గంటలకు గీత మృతి చెంది ఉన్నట్లు పొరుగింటి వ్యక్తి ఆమె సోదరుడు నవీన్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆమె సోదరుడు తన బావపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని ఇన్‌స్పెక్టర్‌ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement