చేవెళ్ల: మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ మాసం ఇఫ్తార్ విందులు నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్ 4వ వార్డులో శుక్రవారం రాత్రి ముస్లింలకు వార్డు కౌన్సిలర్ బక్కరెడ్డి మాధవియాదిరెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమతావెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు బండారి శైలజ, నాయకులు బక్కరెడ్డి రవీందర్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, రవిందర్, మోసిన్, జాఫర్, ఉమ్మర్, సర్దార్, యాసిన్, శివరాజ్, గోపాల్‌రెడ్డి, వెంకటేశ్, యాదయ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య


