కమనీయం.. కల్యాణోత్సవం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. కల్యాణోత్సవం

Mar 7 2026 10:14 AM | Updated on Mar 7 2026 10:14 AM

ఆమనగల్లు: తలకొండపల్లి మండలం దేవునిపడకల్‌లోని వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం స్వామి వారి కల్యాణోత్సవం కనులపండువగా నిర్వహించారు. మేళతాళాల నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను వేదిక మీదకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, గోపాలాచార్యులు కల్యాణక్రతువు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ అనిత మల్లేశ్‌, ఉపసర్పంచ్‌ వెంకటేశ్‌, మాజీ సర్పంచ్‌ శ్రీశైలం, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శంకర్‌, దేవాదాయ శాఖ జూనియర్‌ అసిస్టెంట్‌ ఆంజనేయులు, నాయకులు రామస్వామి, శ్రీరాములు, కృష్ణయ్య, లక్ష్మయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement