సీడీఎంఏ డైరెక్టర్ టీకే శ్రీదేవి
శంకర్‌పల్లి: స్వచ్ఛ నగరాల్లో ఇండోర్ మొదటి స్థానంలో ఉండగా.. దాని సరసన శంకర్‌పల్లి మున్సిపాలిటీ సైతం చేరాలని సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) డైరెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల పాటు చేపడుతున్న ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ఆమె శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం పాలకవర్గం, ప్రజాప్రతినిధులు, పురవాసులతో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్ఛ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని అన్నారు. పట్టణాలు, గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం 99రోజుల బృహత్ కార్యాచరణ చేపట్టిందని, ఒక్కోరోజు ఒక్కో అంశంపై దృష్టి సారించి, పరిష్కారం చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, అధికారులు తమకు అప్పగించిన విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అనంతరం స్వచ్ఛతపై నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఫాల్గుణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యోగేశ్, మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, వైస్‌చైర్‌పర్సన్ శ్వేత, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


