● ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
● వికారాబాద్ ఈగల్ డీఎస్పీ సోమనాథమ్
మర్పల్లి: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ ఈగల్ డీఎస్పీ సోమనాథమ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని బూచన్‌పల్లిలో యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌కు అలవాటు పడి తమ కుటుంబాలను వీధిన పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యసనాల బారిన పడరాదని సూచించారు. కార్యక్రమంలో మోమిన్‌పేట్ సీఐ వెంకటేశం, ఎస్‌ఐ రవూఫ్, ఎంఈఓ అశోక్, ఆర్‌ఐ రమేష్, సర్పంచ్ వెంకట్‌రాంరెడ్డి, ఉప సర్పంచ్ శెఖుల్, మాజీ సర్పంచ్ రవీందర్, యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, బక్కారెడ్డి, సంజీవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
పిల్లలు భద్రంగా ఉండాలంటే..
దుద్యాల్: మన పిల్లలు భద్రంగా ఉండాలంటే గ్రామస్థాయి నుంచే డ్రగ్స్‌ను అరికట్టాలని ఈగల్ డీఎస్పీ శంకర్ యాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలో దుద్యాల్, కుదురుమల్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల్లో మత్తు పదార్థాల వల్ల కలిగే అనార్థాలపై ఎస్‌ఐ శ్రీశైలంతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులతో కలిసి ర్యాలీలు తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ శంకర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు లాలప్ప, సంగీత, రవీంద్ర నర్సింహారెడ్డి, చంద్రయ్య, పంచాయతీ కార్యదర్శులు రాధ, ఆనంద్, సత్యనారాయణ, ఉప సర్పంచులు మహేశ్, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డి, నరేందర్‌రెడ్డి, సాయిలు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


