● స్వతపత్తి సంస్థ ప్రతినిధి వెంకటేశ్వర్లు
● మర్పల్లిలోని వేంకటేశ్వర,
బీరప్ప ఆలయాల సందర్శన
మర్పల్లి: పురాతన మందిరాల జీర్ణోద్ధరణ, అభివృద్ధి కోసం తమ సంస్థ కృషి చేస్తోందని స్వతపత్తి ఆర్గనైజేషన్ ప్రతినిధి వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని గుట్టపై ఉన్న పురాతన వేంకటేశ్వరాలయం, బీరప్ప మందిరాలను మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం రాములు యాదవ్, మర్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేశ్‌యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగదీశ్వర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. స్థానిక ప్రజల సహకారంలో పురాతన మందిరాల పరిరక్షణకు కృషిచేస్తున్నామని చెప్పారు. వేంకటేశ్వరాలయ అభివృద్ధికి రూ.50 లక్షలు అవసరమని తెలిపారు. బీరప్ప ఆలయం గర్భగుడి, ముఖద్వారం నిర్మాణానికి రూ.25 లక్షల అంచనా వేసినట్లు చెప్పారు. రాములు యాదవ్ మాట్లాడుతూ.. తన వంతుగా సొంత డబ్బులు వెచ్చించి రెండు ఆలయాల వద్ద బోరు బావులు తవ్వించి, నీటి వసతి కల్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మర్పల్లి దేవాదాయ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, స్థానిక నాయకులు నర్సింలు యాదవ్, కృష్ణయాదవ్ తదితరులు ఉన్నారు.


