ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
మహేశ్వరం: వచ్చే ప్రాదేశిక ఎన్నికల్లో మహేశ్వరంలో గులబీ జెండా ఎగురవేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం అమీర్‌పేట్ సర్పంచ్ పోతుల మల్లమ్మ, పాలకవర్గ సభ్యులు నగరంలోని ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలంతా బీఆర్‌ఎస్ మద్దతుదారులనే గెలిపించారన్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. అనంతరం సర్పంచ్, వార్డు సభ్యులను ఆమె సన్మానించి అభినందించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి


